అంతా గప్‌చుప్: శశికళ భర్త నటరాజన్ ఏమయ్యారు?

తన భార్య శశికళకు తమిళనాడు పీఠం జారిపోయే పరిస్థితి ఏర్పడిన పరిస్థితిలో కూడా నటరాజన్ ఎక్కుడున్నారనే విషయం తెలియడం లేదు. అంతా గప్‌చుప్‌గానే...

చెన్నై: తమిళనాడు రాజకీయాలు కుర్సీ కోసం అట్టుడుకుతున్న తరుణంలో కూడా అన్నాడియంకె చీఫ్ శశికళ భర్త నటరాజన్ మాట వినిపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారనే విషయాలు కూడా బయటకు రావడం లేదు. అంతా రహస్యంగా సాగుతోంది.

తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పింది శశికళనే అయినా తెర వెనక కథ నడిపిందంతా ఆమె భర్త నటరాజన్ అంటారు. శశికళను ముందు పెట్టి నడిపించేది కూడా ఆయనే అంటారు. అయితే, ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయం తెలియడం లేదు.

శశికళ భర్తగా, మన్నార్ గుడి మాఫియా నాయకుడిగా తమిళ రాజకీయాల్లో గిట్టనివారు ఆయనను పిలుచుకుంటారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం అన్నాడియంకె జెండా కిందికి రావడానికి ఆయన వీలు కాలేదు. అమ్మ మరణం తర్వాత అకస్మాత్తుగా క్రియాశీలకంగా మారింది. జయలలిత అంత్యక్రియల సమయంలో కనిపించారు. ఆయన వ్యూహం కారణంగానే అన్నా డీఎంకే శశికళ చేతుల్లోకి వచ్చిందని అంటారు.

Sasikala's husaband Natarajan where abouts secret

ముఖ్యమంత్రి సీటుపై కూర్చునేందుకు శశికళ అన్నీ సిద్ధం చేసుకున్నారు. శశికళ ఇక్కడి దాకా రావడంలో నటరాజన్ వ్యూహమే ఎక్కువగా ఉందని అంటారు. అయితే, అనూహ్యంగా పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు రోడ్డు మీదికి వచ్చాయి. ఈ సమయంలో నటరాజన్ కనిపించడం లేదు.

నటరాజన్ అనారోగ్యంతో అస్పత్రిలో చేరారని శశికళ వర్గం చెబుతోంది. ఆయన ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆయనకు ఏ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+