ఐటీ దాడులు అడ్డుకున్న శశికళ మద్దతుదారులు, అరెస్టు, మన్నార్ గుడి కాలేజ్ లో సోదాలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్ వర్గీయులు నానా హంగామా చెయ్యాలని ప్రయత్నించి చివరికి అరెస్టు అయ్యారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ శశికళ వర్గీయులను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

IT raids on Jaya TV just After 3 days of Modi-Karunanidhi meet

ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!

శశికళ సోదరుడు దివాకరన్ కు చెందిన మన్నార్ గుడి ఇంటిలో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మద్యాహ్నం వరకూ దివాకరన్ ఇంటిలో సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

sasikala supporters has been arrested in Mannarkudi.

స్వాధీనం చేసుకున్న ఆస్తులు, విలువైన పత్రాల వివరాలను దివాకరన్ నుంచి అడిగి తెలుసుకున్న అధికారులు శుక్రవారం మద్యాహ్నం మన్నార్ గుడిలోని ఆయన విద్యాసంస్థల్లో సోదాలు చెయ్యాలని నిర్ణయించారు. దివాకరన్ కు చెందిన కాలేజ్ లో సోదాలు చెయ్యడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు వెళ్లారు.

శశికళ ఫ్యామిలీకి రెండో రోజూ ఐటీ షాక్, బెంగళూరులో పాత కారులో రూ. కోట్ల ఆస్తుల పత్రాలు!

దివాకరన్ కాలేజ్ లో సోదాలు చెయ్యడానికి వీల్లేదని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఆదాయపన్ను శాఖ అధికారులను కాలేజ్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దివాకరన్ అనుచరులకు నచ్చచెప్పడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారు. చివరికి వారు ఆందోళన విరమించకుండా నానా హంగామా చెయ్యడంతో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ శశికళ, దివాకరన్ మద్దతుదారులను అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
VK Sasikala brother Diwakaran supporters opposing Income tax raid in his college. Diwakaran supporters has been arrested in Mannarkudi.
Please Wait while comments are loading...