రాజ్యసభకు షర్మిల - ఇక ఆ సీఎంతో కలిసి, రాహుల్ బిగ్ టాస్క్..!!
ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త రాజకీయం మొదలు పెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల పైన గురి పెట్టిన కాంగ్రెస్ నాయకత్వంలో మార్పులు చేస్తోంది. కేరళలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్యాచరణ వేగవంతం చేసింది. తమిళనాడులో ప్రభుత్వంలో చేరింది. కర్ణాటకలో డీకేశీ ని సీఎం చేయటం ఖాయమైంది. తెలంగాణలో అధికారంలో ఉంది. ఏపీలో పట్టు పెంచుకునే క్రమం లో షర్మిలను రాజ్యసభకు పంపుతూ.. ఇక్కడ బలం పెంచుకునేందుకు పొరుగు రాష్ట్ర సీఎం కు రాహుల్ టాస్క్ అప్పగించారు.
పీసీసీ చీఫ్ షర్మిలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. దక్షిణాదిలో ఇప్పుడు ఏపీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ చిరునామా గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా రష్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్ తిరిగి వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. షర్మిల పైనా సొంత పార్టీలో విభేదాలు ఉన్నాయి. పార్టీ కంటే అన్న జగన్ పైనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. దీంతో.. ఏపీలో షర్మిల కు మద్దతుగా తమిళనాడు సీఎం విజయ్.. కర్ణాటకలో కాబోయే సీఎం డీకే శివ కుమార్ సహకారం తో కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త రాజకీయం
అందులో భాగంగా షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఏపీ నుంచి నాలుగు సీట్లు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. కాగా, కర్ణాటకలో కాంగ్రెస్‌కు దక్కే మూడు రాజ్యసభ సీట్లకు గాను పలుపురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రం నుంచి బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ పేర్లు ప్రముఖం గా వినిపిస్తుండగా, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు ఏపీలోనూ పార్టీ బలోపేతం దిశగా చర్యల కు సరైన సమయంగా భావిస్తున్నారు. అయితే.. షర్మిల కు టాస్క్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో సీఎం మార్పు పైన అధికారిక ప్రకటన.. ప్రమాణ స్వీకారం తరువాత.. అధికారికంగా రాజ్యసభ అభ్యర్ధుల ను పార్టీ ప్రకటించనుంది. దీంతో.. కాంగ్రెస్ నిర్ణయాలతో ఏపీలో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications