నీకు దండం పెడతాం.. దయచేసి మళ్లీ డాన్స్ చేసి ఖూనీ చేయకు ??

బాలీవుడ్ బ్యూటీ " అనన్య పాండే " గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' ఫిల్మ్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టైగర్ ష్రాఫ్, తారా సుతారియాలతో కలిసి నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లో కాలేజ్ గర్ల్‌గా అనన్యా లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి గాను ఆమెకు బెస్ట్ ఫిలింఫేర్ డెబ్యూ అవార్డు కూడా దక్కింది.

ఆ వెంటనే కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి నటించిన 'పతి పత్ని ఔర్ వో' (2019) రీమేక్‌లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇషాన్ ఖట్టర్‌తో చేసిన మాస్ మసాలా ఎంటర్‌టైనర్ 'ఖాలీ పీలీ' (2020) థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఆమెలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీసింది. కాగా అనన్యా కెరీర్‌లో నటిగా అత్యంత గుర్తింపు తెచ్చిన చిత్రం శకున్ బాత్రా దర్శకత్వంలో వచ్చిన 'గెహ్రాయియాన్' (2022). అలానే 'డ్రీమ్ గర్ల్ 2', 'ఖో గయే హమ్ కహా' వంటి సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతూ బాలీవుడ్‌లో ఒక వర్సటైల్ యాక్ట్రెస్‌గా మారడానికి గట్టిగానే అడుగులు వేస్తోంది.

actress-ananya-pandey-got-heavy-trollings-due-to-classical-and-western-mix-dance-at-chand-mera-dil-m

ఇక తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో తెలుగులో మళ్లీ మరో సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే ప్రస్తుతం తన తాజా ప్రేమకథా చిత్రం ' చాంద్ మేరా దిల్ 'తో ప్రేక్షకుల ముందుకు రాగా.. 'కిల్' ఫేమ్ లక్ష్య లాల్వాని ఇందులో హీరోగా నటించారు. వివేక్ సోని దర్శకత్వం వహించిన ఈ హిందీ సినిమా మొత్తం హైదరాబాద్ నేపథ్యంతో సాగడం విశేషం. కానీ థియేటర్లలో ఈ సినిమా టాక్ కంటే కూడా ఇందులోని ఒక సీన్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది.

ఈ చిత్రంలో అనన్య పాండే సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ఒక భరతనాట్యం నృత్య ప్రదర్శన ఇప్పుడు నెట్టింట తీవ్ర వివాదానికి, ట్రోలింగ్‌కు కారణమైంది. సాంప్రదాయ, కాంటెంపొరరీ శైలిని మిక్స్ చేస్తూ ఆమె వేసిన స్టెప్పులు, బాడీ మూవ్‌మెంట్స్ ఏమాత్రం సరిగ్గా లేవని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అసలు ఆ కదలికలు భరతనాట్యంలా లేవని, కృత్రిమంగా, అసహజంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికల్లో మీమ్స్, సెటైర్ల వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+