వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఎంకే-బీజేపీ వల్లే, నేనే ముఖ్యమంత్రిని అవుతా: శశికళ సంచలనం

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రస్తుత సంక్షోభానికి ప్రతిపక్ష డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని ఆమె సామాజిక అనుసంధాన వేదిక .

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రస్తుత సంక్షోభానికి ప్రతిపక్ష డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆరోపించారు.

పన్నీరును కౌగిలించుకొని ఏడ్చిన ఎమ్మెల్యే, జయ ఫ్యామిలీకి విజ్ఞప్తిపన్నీరును కౌగిలించుకొని ఏడ్చిన ఎమ్మెల్యే, జయ ఫ్యామిలీకి విజ్ఞప్తి

తాను ముఖ్యమంత్రి కాకుండా బీజేపీ, డిఎంకే పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఎవరు అడ్డుపడ్డా తాను ముఖ్యమంత్రిని అవుతానన్నారు. తనను ఎవరూ అడ్డుకోలేరన్నారు. బీజేపీ, డీఎంకే పార్టీల సూచనతోనే గవర్నర్ విద్యాసాగర రావు తన బల నిరూపణకు ఆలస్యం చేస్తున్నారన్నారు.

Sasikala takes on DMK and BJP

మరోవైపు, పోయెస్ గార్డెన్స్‌లోని వేద నిల‌యంలో నివాసం ఉంటున్న శ‌శిక‌ళ వ‌ద్ద‌కు ఈ రోజు ఉద‌యం నుంచి ఆమె మ‌ద్ద‌తుదారులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. చిన్న‌మ్మ‌కు ఎదురుతిరిగిన పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని వారు ఆరోపిస్తున్నారు.

నేను తలుచుకుంటే: శశికళకు పన్నీరు సెల్వం తీవ్ర హెచ్చరికనేను తలుచుకుంటే: శశికళకు పన్నీరు సెల్వం తీవ్ర హెచ్చరిక

కాస్త‌ ఆలస్యమైనా సీఎం అయ్యే వ్య‌క్తి శ‌శిక‌ళేన‌ని మీడియాతో చెబుతున్నారు. వారంద‌రి వ‌ద్ద జయలలిత, శశికళ ఇద్దరూ ఉన్న ఫొటోలు క‌న‌ప‌డుతున్నాయి. త‌మ రాష్ట్ర గవర్నర్ తీరుప‌ట్ల వారు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి తీరు స‌రికాద‌ంటున్నారు. పన్నీర్ వద్ద ఉన్నది కేవ‌లం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే అన్నారు.

సీఎం పదవి ఖాళీగా లేదు: వెంకయ్య

తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు వేరుగా అన్నారు. తమిళనాడు రాజకీయాల పైన ఆయన స్పందించారు. గవర్ర్ విద్యాసాగర రావు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.

English summary
AIADMK chief Sasikala on the backfoot as Caretaker Chief Minister Panneerselvam gains more support in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X