పెరుగుతున్న పన్నీరు బలం: ఆందోళన, వ్యూహం మార్చిన శశికళ
గవర్నర్ వద్ద తనకు చుక్కెదురవుతుందని భావిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వ్యూహం మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమె తన ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీగవర్నర్ వద్ద తనకు చుక్కెదురవు వెళ్లాలని నిర్ణయించారు.
చెన్నై: గవర్నర్ వద్ద తనకు చుక్కెదురవుతుందని భావిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వ్యూహం మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోవడం, సమయం గడుస్తున్న కొద్దీ పన్నీర్ సెల్వం బలం పుంజుకోవడం శశికళ వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ క్రమంలో శశికళ మరో అడుగు ముందుకేసి తన బలాన్ని నిరూపించుకునేందుకు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం నిర్ణయాల ప్రకారం గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తన వద్దనున్న 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించేందుకు శశికళ వర్గం రంగం సిద్ధం చేసుకుంది.

మరోవైపు తమిళనాడు వ్యవహారం గవర్నర్ రాష్ట్ర పరిస్థితి పైన కేంద్రానికి నివేదిక ఇచ్చారు. తనకు సలహా ఇవ్వాలని కేంద్ర హోం శాఖను గవర్నర్ కోరారు. దీంతో కేంద్రం నిర్ణయం వచ్చేసరికి మరికొంత సమయం పట్టే అకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సాయంత్రంలోగా గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే నేరుగా రాష్ట్రపతి ముందే తమ బలాన్ని నిరూపించుకుంటామని శశికళం వర్గం చెబుతోంది. ముఖ్యమంత్రిగా చిన్నమ్మతో ప్రమాణ స్వీకారం చేయించకపోతే రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.












Click it and Unblock the Notifications