జయలలిత బెడ్ రూంలో శశికళ, ఏం చేస్తున్నారంటే ?
పోయెస్ గార్డెన్ లోనే మకాం వేసిన శశికళ ఇప్పుడు జయలలిత బెడ్ రూంలో కునుకుతీస్తున్నారని అన్నాడీఎంకే నాయకులు అన్నారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులే కాదు ఆమెకు చెందిన ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు నెచ్చెలి శశికళ సొంతం అవుతున్నాయి. ఇంత కాలం జయలలిత ఉపయోగించిన కారులోనే ప్రస్తుతం శశికళ సంచరిస్తున్నారు.
అంతే కాకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జయలలిత కుర్చున్న కుర్చిలో శశికళ కుర్చుంటున్నారు. తమిళనాడు సచివాలయంలోని సీఎం కార్యాలయంలో జయలలిత కుర్చిలో ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంత వరకూ కుర్చోలేదు.

ఆ కుర్చిని సైతం పోయెస్ గార్డెన్ కు పంపించి అమ్మ మీద ఉన్న గౌరవాన్ని మరోసారి నిరూపించారు. అమ్మ తనకు కేటాయించిన కార్యాలయంలోనే ప్రస్తుతం పన్నీర్ సెల్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోయెస్ గార్డెన్ లోనే మకాం వేసిన శశికళ ఇప్పుడు జయలలిత బెడ్ రూంలో కునుకుతీస్తున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
జయలలిత ప్రతి వస్తువు శశికళ సొంతం అవుతాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. నూతన సంవత్సరంలొ అడుగు పెట్టిన సందర్బంగా శశికళ తన ప్రాణ స్నేహితురాలు జయలలిత బెడ్ రూంలో గడిపారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. అయితే ఇతరులను మాత్రం జయలలిత బెడ్ రూంలోకి అనుమతి ఇవ్వలేదని అన్నాడీఎంకే నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications