శశికళ‘పురచ్చి తరగై: అమ్మ పోయి 10 రోజులు కాకముందే ?
చెన్నై: జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చలి శశికళ నటరాజన్ ఇప్పుడు అన్నాడీఎంకే నాయకుల పాలిట దేవత అయ్యారు. అన్నాడీఎంకే పార్టీలో ఎంజీఆర్ తరువాత అంతా తానై నడిపించిన జయలలితకు'అమ్మా, పురుచ్చి తలైవి'అనే బిరుదులు ఇచ్చారు.
తమిళనాట అమ్మగా గుర్తింపు తెచ్చుకుని ప్రజల గుండెల్లో, పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో జయలలిత చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేలోని ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు చిన్నమ్మ భజన చేస్తున్నారు.

'అమ్మగా, పురుచ్చి తలైవి'గా తమిళనాడులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జయ నెచ్చలి శశికళకు అలాంటి అరుదైన బిరుదు ఇచ్చేసి ఏకంగా 'పురుచ్చి తరగై'అంటు తమిళనాడులో పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
అమ్మ చనిపోయి 10 రోజులు కూడా పూర్తి కాకుండానే ఏమిటీ ఈ హంగామా అంటూ అన్నాడీఎంకేలోని కొందరు నాయకులు మండిపడుతున్నారు. మొత్తం మీద శశికళను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె వర్గీయులు ఈ విధంగా నానాపాట్లు పడుతున్నారు.












Click it and Unblock the Notifications