పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలు చూస్తే.. పొట్ట చక్కలే..!
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. దీనికి సంబంధించిన సైటరికల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
కొన్ని వీడియోల్లో పాకిస్థాన్ సైనికులు పాతకాలపు ఆయుధాలతో కవాతు చేస్తున్నట్లు చూపగా, మరికొన్నింటిలో సైకిళ్లపై వెళ్తున్నట్లు ఫన్నీ ఎడిటింగ్ చేశారు. ఇంకొన్ని వీడియోల్లో అయితే, అప్పులు చేసి యుద్ధానికి ఎలా వెళ్తారంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఒక వీడియోలో అయితే, "మా దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి... అవే మా పాత బట్టలు" అంటూ సెటైర్ వేశారు.

నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. "ఇలాంటి యుద్ధ సన్నాహాలు చూస్తుంటే నవ్వాపుకోలేకపోతున్నా", "వాళ్ల దగ్గర యుద్ధం చేయడానికి డబ్బులు లేవు కానీ, మాటలు మాత్రం పెద్దగా చెప్తారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pakistanis are all prepared for war.
— Squint Neon (@TheSquind) April 26, 2025
Very Fears Lag Raha hai 🥺🥺 pic.twitter.com/QSrv7UcjQW
మొత్తానికి, పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలపై వస్తున్న ఈ సైటరికల్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, యుద్ధం గురించి మాట్లాడటంపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వీడియోలు చూస్తే ఎవరికైనా నవ్వు ఆగదు అనడంలో సందేహం లేదు.
लिल्लाह !
— Er. Rajesh Singh (@Kumar1975Rajesh) April 26, 2025
.
पाकिस्तान एयरफोर्स के जवान "भारत" से युद्ध कि "तैयारी" में जुट गए है !
.
तैयारी भी बहुत उंच्च कोटी कि है "भिखमंगो" कि !
.
😂😂 pic.twitter.com/RP6bEQGKYD
ఇదిలా ఉంటే..భారత్‌తో పాకిస్థాన్ యుద్ధానికి దిగేంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆయుధాల దగ్గర నుంచి, సైన్యం, క్షిపణిల వరకు అన్నింటిల్లోనూ పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది.ముఖ్యంగా యుద్ధం చేసేంత ఆర్థిక సామార్థ్యం పాక్‌కు లేదనే చెప్పాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్లీష్టంలో ఉందనేది అక్షర సత్యం. దశాబ్దాలుగా కొనసాగుతున్న రుణ భారం, బలహీనమైన ఎగుమతులు, రాజకీయ అస్థిరత్వం దేశాన్ని ఆర్థికంగా కుంగదీశాయి. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించినా, పాకిస్తాన్ నేడు తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి సహాయం పొందినప్పటికీ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. పన్ను వసూళ్లలో అసమర్థత, ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది.
అక్కడి మధ్య తరగతి ప్రజలకు సరైన తిండి కూడా లభించడం లేదని తెలుస్తోంది. మోటర్ సైకిల్ ఉన్న వారికి అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేని స్థితిలో పాకిస్థాన్ యువత ఉంది. అలాంటి పాకిస్థాన్ భారత్‌పై యుద్ధానికి దిగుతుందా అంటే లేదనే చెప్పాలి. ప్రస్తుతం పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తిప్పి కొట్టడానికి భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications