Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ సింధూర సక్సెస్‌లో మన తెలుగుతేజం కీలక పాత్ర..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది భారత ఆర్మీ. పాకిస్థాన్‌లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు నిర్వహించింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. భారత్ నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. అయితే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతం అయ్యాడు. రవూఫ్ అజహర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశాడు.

అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ కే కాదు.. ప్రపంచ దేశాలూ ఉలిక్కి పడ్డాయి. భారత ఆయుధ సంపత్తి చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కైతున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో స్వదేశీ సాంకేతికతో సత్తా చాటింది భారత్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పథకాలు ఇందుకు దోహదపడ్డాయి. మన డిఫెన్స్ వ్యవస్థ బలోపేతం కావడంలో తెలుగు సైంటిస్ట్ కృషి దాగి ఉంది. రాకెట్ మ్యాన్ గా పేరొందిన డీఆర్డీడీఓ మాజీ చైర్మెన్ డాక్టర్ సతీష్ రెడ్డి భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించారు.

Satish Reddy The Telugu Scientist Behind Operation Sindoor

గగనతల యుద్ధంలో సత్తా చాటిన భారత్.
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం తన గగనతల సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. పాకిస్థాన్ కుట్రలను తిప్పికొట్టడంలో భారత రక్షణ రంగ అభివృద్ధి మరియు పరిశోధన సంస్థ (DRDO) శాస్త్రవేత్తల దశాబ్దాల కృషి ఫలించింది. "ఆపరేషన్ సింధూర్" సక్సెస్ లో మనదేశం స్వదేశి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన యాంటి డ్రోన్ సిస్టం పనితీరు ప్రపంచ దేశాలను అబ్బుర పరిచింది. స్వదేశీ పరిజ్ఞ్యానంతో సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడి తలపెట్టిన "ఆత్మ నిర్భర్ భారత్" ప్రాజెక్ట్ విజయ ప్రస్థానంలో మన తెలుగువాడైన మాజీ DRDO ఛైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డిది కీలక భూమిక పోషించారు. డాక్టర్ జి సతీష్ రెడ్డి నాయకత్వంలోని DRDO శాస్త్రవేత్తల బృధం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల ప్రసంశలు అందుకుంది.

పాక్ ఎత్తులను చిత్తు చేసిన భారత్ మిసైళ్లు
మే 7.. న సాయుధ దళాలు "ఆపరేషన్ సింధూర్" ప్రారంభించాయి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగాయి. "ఆపరేషన్ సింధూర్" తో పాకిస్థాన్ వెన్ను విరవడంతో పాటు మన దేశ స్వదేశి సాంకేతిక సైనిక శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాయి మన సాయుధ బలగాలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా భారత్ తలపెట్టిన ఆత్మ నిర్భర్ యుద్ధంలో డిఆర్‌డిఒ స్వదేశి సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాంటి డ్రోన్ సిస్టమ్స్ అద్భుత ఫలితాలు సాధించాయి. మాజీ డిఆర్‌డిఒ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో విజయవంతమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+