వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామలింగ రాజు సహా పది మందికి ఏడేళ్ల ఖైదు: జైలుకు తరలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పదిమందిని దోషులుగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం వారికి శిక్షను ఖరారు చేసింది. రామలింగ రాజు సహా దోషులకు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజుకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. మిగతా ఎనిమిది మంది దోషులకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 జరిమానా విధించింది.

తనకు శిక్ష తగ్గించాలన్న రామలింగ రాజు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. శిక్ష కాలం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. కేసులో.. ఏ1 రామలింగ రాజు, ఏ2 రామరాజు, ఏ3 వడ్లమాని శ్రీనివాస్, ఏ4 గోపాలకృష్ణన్, ఏ5 తాళ్లూరి శ్రీనివాస్, ఏ6 సూర్యనారాయణ రాజు, ఏ7 రామకృష్ణ, ఏ8 వెంకటపతి రాజు, ఏ9 శ్రీశైలం, ఏ10 వీఎస్‌పీ గుప్తాలు ఉన్నారు. శిక్ష పడిన రామలింగ రాజు సహా పది మందిని హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు.

రామరాజు

రామరాజు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రామరాజును కూడా కోర్టు దోషిగా తేల్చింది. రామలింగ రాజు సోదరుడు అయిన రామరాజుకు రూ.5 కోట్ల జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

వడ్లమాని శ్రీనివాస్

వడ్లమాని శ్రీనివాస్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో వడ్లమాని శ్రీనివాస్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది. ఇతనికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్ష జరిమానా విధించింది.

తాళ్లూరి శ్రీనివాస్

తాళ్లూరి శ్రీనివాస్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తాళ్లూరి శ్రీనివాస్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది. ఇతనికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్ష జరిమానా విధించింది.

రామలింగ రాజు

రామలింగ రాజు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రామలింగ రాజును కోర్టు దోషిగా తేల్చింది. రామలింగ రాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా విధించింది.

అంతకుముందు కేసులో రామలింగ రాజు, రామరాజు, సూర్య నారాయణ రాజు, వడ్లమాని శ్రీనివాస్, గోపాల కృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, ప్రభాకర్, వెంకటపతి రాజు, శ్రీశైలంల పైన నేరం రుజువు కాగా.. రామలింగ రాజు సహా నిందితులందరూ దోషులుగా ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. శిక్ష పైన వాదనల సమయంలో రామలింగ రాజు కోర్టుకు శిక్ష తగ్గించాలని మొర పెట్టుకున్నారు.

గతంలో దాదాపు మూడేళ్ల పాటు జైలులో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని, పిల్లల బాధ్యతను తాను చూసుకోవాల్సి ఉందని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సి ఉందని, సామాజికంగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టానని, తన సేవలను గుర్తించైనా తనకు పడే శిక్ష తగ్గించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు.

English summary
Satyam Case: Rs.25 lakh fine, 6 months imprisonment to Ramalinga Raju
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X