'ప్రైస్' నిరుత్సాహం!: ట్విట్టర్లో హాట్, నాడు-నేడు రామలింగరాజు(పిక్చర్స్)
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఆడిట్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ సంస్థ నిరుత్సాహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఉద్యోగుల తప్పు ఏమీ లేదని చెప్పింది. సత్యం కేసులో సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను కోర్టు దోషులుగా తేల్చింది. తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు.
సత్యం కుంభకోం కేసులో రామలింగ రాజు సహా పదిమందిని కోర్టు గురువారం దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. వారి పైన మోసం, నేరపూరిత కూట్ర, ఫోర్జరీ, నమ్మక ద్రోహం వంటి కేసులు ఉన్నాయి. నిందితులకు గురువారం మధ్యాహ్నం కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.
తీర్పు తర్వాత రామలింగ రాజు సహా నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశముంది. నిందితుల్లో రామలింగ రాజుతో పాటు ఆయన ఇద్దరు సోదరులు, ఉద్యోగులు ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా రామలింగ రాజు 33 నెలల పాటు జైలులో ఉన్నారు. కాగా సత్యం కేసు విషయంలో ట్విట్టర్‌లో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కేసు తీర్పు వెలువడగానే.. భారత్‌లో సామాజిక అనుసంధాన వేదిక పైన ఇది హాట్ టాపిక్ అయింది.

రామలింగ రాజు
2007-08 సమయంలో సత్యం రామలింగ రాజు ఓ కార్యక్రమంలో ఇలా దర్జాగా కూర్చొని మాట్లాడుతున్న దృశ్యం.

రామలింగ రాజు
ఏడేళ్ల క్రితం సత్యం రామలింగ రాజు ఓ కార్యక్రమంలో ఇలా దర్జాగా కూర్చొని మాట్లాడుతున్న దృశ్యం.

రామలింగ రాజు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రామలింగ రాజును సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.

రామలింగ రాజు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రామలింగ రాజును కోర్టు దోషిగా తేల్చింది.












Click it and Unblock the Notifications