వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SBI బంపర్ ఆఫర్: గృహ రుణాలపై ప్రత్యేక రాయితీలు.. కండీషన్స్ అప్లయ్..!

|
Google Oneindia TeluguNews

ప్రతి ఒక్కరికీ సొంతిటి కల ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకుల వద్దకు రుణాల కోసం వెళతారు. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీతో రుణాలు ఇస్తోంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. గృహ రుణాలకు దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు బ్యాంకు మూడు ఆఫర్లను అందిస్తోందంటూ ప్రకటనలో పేర్కొంది.

గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు

గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. గృహ రుణాలు తీసుకునేవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని కోరింది. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు ఉండదని పేర్కొంది. రూ.30 లక్షలు కంటే ఎక్కువగా రూ.కోటి కంటే తక్కువగా రుణాలు తీసుకున్నవారి సిబిల్ స్కోర్ బాగుంటే కనక తాజా గృహ రుణంపై 0.10శాతం రాయితీ ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అదే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం అప్లయ్ చేస్తే 0.5శాతం అదనంగా రాయితీ వస్తుంది. కరోనావైరస్ భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన నేపథ్యంలో తిరిగి గాడిలో పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించడమో లేక యథాతథంగా ఉంచడమో చేసింది. ఈ క్రమంలోనే రెపోరేట్‌ను 4శాతంగా నిర్ణయించడంతో గృహ రుణాలపై వడ్డీ రేటు అమాంతం పడిపోయింది. దశాబ్దకాలంలో గృహరుణాలపై వడ్డీరేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి.

గృహ రుణాలపై వడ్డీ రేటు

గృహ రుణాలపై వడ్డీ రేటు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్త గృహ రుణాలన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్కు‌తో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం అది 6.65శాతంగా ఉంది. అంటే గృహరుణాలపై వడ్డీలు రెపోరేట్‌తో ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే హోమ్‌లోన్స్ పై వడ్డీ రేటు వేతనం తీసుకుంటున్నవారికైతే 6.95శాతం నుంచి 7.45 శాతం వరకు ఉండగా... అదే స్వయంఉపాధి వారికి 7.10శాతం నుంచి 7.60శాతంగా ఉంది. ఇక తాజాగా ఎస్బీఐ ప్రకటించిన రాయితీలతో రుణంపై మరో 0.40శాతం ఆదా అవుతుంది.

నిపుణులు ఏం చెబుతున్నారు..?

నిపుణులు ఏం చెబుతున్నారు..?


ప్రస్తుతం ఎస్‌బీఐ నుంచి గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఇది సరైన సమయం అని నిపుణులు చెబుతున్నారు. ఇతర బ్యాంకులు గృహ రుణాలపై ఎంసీఎల్‌ఆర్, లేదా బీపీఎల్‌ఆర్‌తో ముడిపడి ఉన్న వడ్డీ రేట్లను విధిస్తున్నాయని చెబుతున్నారు. ఇతర బ్యాంకుల నుంచి గృహరుణాలు పొందిన వారు ఆర్బీఐ ప్రకటించిన రెపో రేట్‌ తగ్గింపు ప్రయోజనాలను పొందడం లేదని చెబుతున్నారు. వీరు గృహ రుణాలపై ఎంసీఎల్‌ఆర్ లేదా బీపీఎల్‌ఆర్‌తో అనుసంధానమై ఉన్న వడ్డీ రేట్లనే బ్యాంకులకు చెల్లిస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసుకోండి


ఇదిలా ఉంటే ఇతర బ్యాంకుల నుంచి ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్నవారు... ఆ రుణం చెల్లించేందుకు ఇంకా 15ఏళ్లు పాటు సమయం ఉంటే వెంటనే అది స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసుకుంటే లబ్ధి పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వీరు 7.50 శాతం వడ్డీ కడుతున్నారు. ఉదాహరణకు ఇతర బ్యాంకు నుంచి 7.50శాతం వడ్డీ రేటుతో రూ. 30 లక్షలు తీసుకుని ఆ రుణం చెల్లించేందుకు ఇంకా 15 ఏళ్ల సమయం ఉన్నట్లయితే దాన్ని వెంటనే ఎస్బీఐకి బదిలీ చేసుకుంటే రూ.1.52 లక్షలు మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు.

English summary
State bank of India announced special offers on home loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X