ఎస్బీఐ కస్టమర్ అలర్ట్: మూడు రోజులపాటు ఇంటర్నెట్, యూపీఐ, యోనో సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. బ్యాంకుకు సంబంధించిన నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంక్ డిజిటల్ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలు మూడు రోజులపాటు పరిమిత సమయంలో నిలిచిపోనున్నాయి.
ఖాతాదారులు మెరుగైన సేవలు అందించడంలో ఆయా సేవల్లో శుక్రవారం నుంచి ఆదివారం(మే 21, మే 22, మే23) మధ్య అప్‌గ్రేడేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల 45 నిమిషాల నుంచి రెండున్నర గంటలపాటు, ఆదివారం తెల్లవారుజామున 2.40 నిమిషాల నుంచి 06 గంటల 10 నిమిషాల వరకు డిజిటల్ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని ట్విట్టర్ వేదికగా తెలిపింది.

'ఈ కాలంలో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ అందుబాటులో ఉండదు. అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము, మాతో సహకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము' అని ఎస్బీఐ తెలిపింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/LNMnKjORMR
— State Bank of India (@TheOfficialSBI) May 20, 2021
కాగా, కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్, ఆంక్షల కారణంగా ఎస్బీఐ తన పనివేళలను మార్చుకున్న విషయం తెలిసిందే. ఎస్బీఐతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఆయా రాష్ట్రాల కరోనా నిబంధనలకు అనుగుణంగా తమ పనివేళలను నిర్ణయించుకున్నాయి.












Click it and Unblock the Notifications