ఎస్ బీ ఐ బంపర్ ఆఫర్: బేస్ రేటు 15 పాయింట్లు తగ్గింపు
దేశీయ ప్రబుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు బంఫర్ బొనాంజా ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశీయ ప్రబుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు బంఫర్ బొనాంజా ప్రకటించింది.
ఎస్ బి ఐ ఇటీవలనే తన అసోసియేట్ బ్యాంకులను విలీనం చేసుకొంది.దీంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఎస్ బి ఐ అవతరించింది.
ఎస్ బి ఐ ఇటీవల కాలంలో కొత్త మార్పులను తీసుకు వచ్చింది. ఈ మేరకు కొత్త మార్పుల ప్రకారంగా కనీస నగదు నిల్వ లేని బ్యాంకు ఖాతాలదారులపై భారీగా జరిమానాను విధించనున్నట్టు ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుండి తన ఖాతాదారులకు షాక్ ల తో పాటు శుభవార్తలను కూడ అందించనుంది.ఈ మేరకు కొత్త ఎస్ బి ఐ తన బేస్ రేట్లలో కోత పెట్టింది.

బేస్ రేట్లను తగ్గించిన ఎస్ బి ఐ
ఎస్ బి ఐ బేస్ రేట్లను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. తన బేస్ రేటులో 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది.అనుబంధ బ్యాంకుల విలీనంతో అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన 48 గంటలలోపే ఎస్ బి ఐ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.ఈ నిర్ణయం ఎస్ బి ఐ ఖాతాదారులకు బంపర్ ఆఫరే.

ఏప్రిల్ నుండే కొత్త రేట్లు అమలు
2017 ఏప్రిల్ నుండి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని ఎస్ బి ఐ ప్రకటించింది.ప్రస్తుత బేస్ రేటు 9.1 శాతంగా ఉంటుంది. తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకొన్న తర్వాత ఎస్ బి ఐ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా ఖాతాదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాత రుణాలపై బేస్ రేట్ కోత
గృహ, వాహనాలపై పాత రుణాలపై 2016 మార్చి 31వ, తేది కంటే ముందు తీసుకొన్న రుణాల వడ్డీ రేటులో కొత పెట్టింది ఎస్ బి ఐ,. గృహ, వాహన రుణాలపై ప్రస్తుత రేటు 9.1 శాతంగా నిర్ణయించింది. అయితే ఎంసీఎల్ఆర్ ను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది ఎస్ బి ఐ.

ఎంసీఎల్ఆర్ కు, బేస్ రేటకు మధ్య తేడాతో ఖాతాదారుల ఆందోళన
ఎంసీఎల్ఆర్ కు, బేస్ రేటుకు మధ్య వ్యత్యాసం చాల ఎక్కువగా ఉండడంతో పాత రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఖాతాదారుల ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్ బి ఐ కు చెందిన ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 8 శాతం ఉండగా, బేట్ రేటు 9.25 శాతం ఉంది. గత పదిహేను నెలల్లో ఎస్ బీ ఐ తన ఎం సీ ఎల్ ఆర్ ను దాదాపు 1.20 శాతం తగ్గించగా బేస్ రేటును మాత్రం కేవలం0.05 శాతం మాత్రమే తగ్గించింది.

వార్షిక వడ్డీరేట్లు యధాతథం
జనవరిలో ప్రకటించిన వార్షిక రుణ వడ్డీరేట్లను ఎస్ బి ఐ 8 శాతం వద్ద, రెండేళ్ళ వడ్డీ రేటనును 8.1 శాతం వద్ద యధాతథంగా ఉంచింది.అయితే అంచనాల ప్రకారంగా మొత్తం ప్లోటింగ్ రేటు రుణాల్లో కేవలం 30-40 శాతం ఎంసీఆల్ ఆర్ ఆధారిత లోన్లు కాగా, మిగిలిన రుణాలు బేస్ రేట్ ఆధారితం.












Click it and Unblock the Notifications