రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్ బిఐ,మిగిలిన బ్యాంకులు కూడ తగ్గించే అవకాశం

ఎస్ బి ఐ అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 0.9 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇవాళ నిర్ణయాన్ని ఎస్ బి ఐ ప్రకటించింది.అయితే మిగిలిన బ్యాంకులు కూడ ఇదే దారిలో పయనించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ :రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఎస్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆదివారం నాడు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ఎస్ బి ఐ ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై 0.9 శాతం వడ్డీరేట్లను తగ్గిస్తున్నటు ఎస్ బి ఐ ప్రకటించింది.

నగదు విస్తృతంగా మార్కెట్లో చలామణి చేసేందుకు బ్యాంకురుణాలపై ఉన్న వడ్డీరేట్లను తగ్గించాలని గత ఏడాది చివరి వారంలో బ్యాంకర్లతో సమావేశమైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ కూడ ఇదే అంశాన్ని బ్యాంకలకు చెప్పాడు.

sbi cuts lending rate 0.9 across maturities

ప్రధానమంత్రి కోరిన తర్వాత ఎస్ బి ఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై ఉన్న వడ్డీ రేటును 0.9 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది ఎస్ బి ఐ. ఎస్ బి ఐ తో పాటే ఇతర బ్యాంకులు కూడ ఇదే బాటలో పయనించే అవకాశం లేకపోలేదు.

2015 నుండి ఇప్పటివరకుఎస్ బి ఐ సుమారు 2 శాతం వడ్డీరేటును తగ్గించింది. తగ్గించిన వడ్డీరేట్లు ఈ రోజు నుండి అమల్లోకి రానున్నాయి. కాలపరిమతితో సంబంధం లేకుండానే వడ్డీ రేట్లపై ఎస్ బి ఐ ఈ నిర్ణయం తీసుకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+