SBI: ఖాతాదారులకు షాకివ్వనున్న ఎస్బీఐ.. ఆ ఛార్జీలు పెంపు..!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఎస్బీఐ డెబిట్ కార్డు మెయింటనెన్స్ ఛార్జీలను పెంచింది. గరిష్ఠంగా రూ.75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనం. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్ డెబిట్ కార్డులపై బ్యాంక్ రూ. 125 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు దాన్ని పెంచింది.

ఏప్రిల్ నుంచి ఈ ఛార్జీని రూ.200 పెంచింది. ఇక గోల్డ్, కాంబో, యువ కార్డులపై ప్రస్తుతం రూ.175 మెయింటనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.250కి పెంచనున్నారు. ప్లాటినం డెబిట్ కార్డుకు ప్రస్తుతం రూ.250 తీసుకుంటుండగా.. ఏప్రిల్ 1 నుంచి రూ.325 వసూలు చేస్తారు. బిజినెస్ ప్రీమియం, ఫ్రైడ్ కార్డులపై ప్రస్తుతం సంవత్సరానికి రూ.350 వసూలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రూ.425 వసూలు చేయనున్నారు.

SBI will increase debit card maintenance charges from April 1

ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కూడా పలు సవరణలు చేశారు. రూ. 25,000 వరకు మెయింటెన్ చేసేవారు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 3 ఫ్రీ ట్రాన్స్ క్షన్స్ చేయవచ్చు. ఏస్బీఐ ఏటీఎంల్లో అయితే 5 ఉచిత లావాదేవీలు పొందవచ్చు. రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు ఖాతాలో ఉంచుకునేవారు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో 3 ఉచిత లావాదేవీలు ఎస్బీఐ ఏటీఎంల్లో అన్ లిమిటెట్ లావాదేవీలు చెయ్యొచ్చు. మెట్రో నగరాల్లో అయితే రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మెయింటెన్ చేసేవారు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 3 ఉచిత, ఏస్బీఐ ఏటీఎంల్లో అయితే 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.

రూ. 1,00,000 పైన ఖాతాలో ఉంచుకునే వారు ఇతర బ్యాంకులు, ఎస్బీఐ ఏటీఎంల్లో అన్ లిమిటెడ్ లావాదేవీలు పొందవచ్చు. ఖాతాలో త్రైమాసికంలో సగటున రూ. 25,000 బ్యాలెన్స్‌ మెయింటెన్ చేయాలట. లేకుంటే డెబిట్ కార్డ్ హోల్డర్‌ల నుంచి త్రైమాసికానికి రూ. 12 (GSTతో సహా) జరిమానా విధిస్తారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+