CJI NV Ramana: మత మార్పిళ్లు..హిందూ మహిళలపై దాడులు: దర్యాప్తునకు నో..పిటీషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: బలవంతపు మత మార్పిళ్లు, హిందూ మహిళలపై కొనసాగుతోన్నట్టుగా భావిస్తోన్న దాడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి- సమగ్ర దర్యాప్తును జరిపించాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. దినపత్రికల్లో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తునకు ఆదేశించలేమని వ్యాఖ్యానించింది.

Recommended Video

    Justice N V Ramana To Be Next CJI, Gets Presidential Assent For His Appointment

     హర్యానాలో యథేచ్ఛగా మతమార్పిళ్లు..

    హర్యానాలో యథేచ్ఛగా మతమార్పిళ్లు..

    హర్యానాలోని నుహ్ జిల్లాలో ముస్లింల జనాభా అధికంగా ఉందని, కొంతకాలంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆదేశించారు. హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్నారని వివరించారు. వాటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. నుహ్ జిల్లాలో హిందు మతానికి చెందిన మహిళలపై యథేచ్ఛగా దాడులు సాగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని ఆ న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

    దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు..

    దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు..

    సిట్ ఏర్పాటు చేసేలా హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నుహ్ జిల్లాలో నెలకొన్న పరిస్థితుపై తాను సేకరించిన కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగులను వారు తమ పిటీషన్లకు జత చేశారు. వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించింది. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ తన వాదనలను వినిపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

     హిందూ దేవాలయాల భూములు కబ్జా..

    హిందూ దేవాలయాల భూములు కబ్జా..

    సిట్, సీబీఐ లేదా ఎన్ఐఏ, లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో ప్రత్యేక కమిషన్‌ ద్వారా విచారణ జరిపించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. హిందువులకు చెందిన ఆస్తులను బలవంతంగా తమ పేర్లు రాయించుకుంటోన్నారని, మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టుకు వివరించారు. దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడం, హిందూ స్మశాన వాటికలను యథేచ్ఛగా కబ్జా చేసుకోవడం నుహ్ జిల్లాలో నిత్యకృత్యమైందని చెప్పారు. దీన్ని అడ్డుకట్ట వేసేలా.. సమగ్ర దర్యాప్తును జరిపించేలా హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

     20 నుంచి 10 శాతానికి పడిపోయిన హిందూ జనాభా..

    20 నుంచి 10 శాతానికి పడిపోయిన హిందూ జనాభా..

    నుహ్ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో తబ్లిగి జమాతీలు తిష్ఠ వేశారని చెప్పారు. బలవంతపు మతమార్పిళ్ల వల్ల 2011లో 20 శాతం వరకు ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 10 నుంచి 11 శాతానికి పడిపోయిందని వికాస్ సింగ్ వాదించారు. దీనికి సంబంధించి.. దినపత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనానికి అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం ధర్మాసనం తన నిర్ణయాన్ని వినిపించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా దర్యాప్తునలకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ రెండు పిటీషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+