వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అధికారాల వ్యవహారంలో నాలుగు రోజుల క్రితం హైకోర్టులో కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, శుక్రవారం నాడు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారాల పైన కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పైన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం, ఆప్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మూడు వారాల్లోగా నోటీసు పైన స్పందించాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను పరిశీలించారని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో, దానిని విచారించింది.

SC issues notice to Kejriwal govt, stays observation of Delhi HC on ACB's jurisdiction over Delhi Police

కాగా, ఢిల్లీ హైకోర్టులో సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టానుసారంగా వ్యవహరించరాదని హైకోర్టు చెప్పింది. ఏసీబీ అధికారులు ఢిల్లీ ప్రభుత్వ అదేశాలనే పాటించాలని ఆదేశించింది.

ఏసీబీ ఆధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు పాటించవద్దని చెప్పింది. ప్రజలు అధికారం ఇచ్చిన పార్టీని లెఫ్టినెంట్ గవర్నర్ హితవు పలికింది. ఏసీబీ అధికారులకు పోలీసులను అరెస్టు చేసే అధికారం ఉందని చెప్పింది. హైకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలన్న కేంద్రం యత్నాలకు తీర్పు చెంపపెట్టు అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

English summary
SC issues notice to Kejriwal govt, stays observation of Delhi HC on ACB's jurisdiction over Delhi Police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X