వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నో

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పోలవరం ముంపు మండలాల సవరణ చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వాలంటూ న్యాయవాది రాజేందర్‌రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్‌కు పోలవరం పిటిషన్‌ను ధర్మాసనం జత చేసింది. ఈ కేసులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

SC rejects to stay on Polavaram villages

ఆరు వారాల్లోగా నోటీసులపై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఆ తర్వాత ప్రధాన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు పోలవరం పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా రాష్ట్ర విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది రాజేందర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Supreme court rejected to give stay orders on Polavaram villages. Lawyer Rajender Reddy challenged the merger of 7 mandals in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X