చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

35 మంది చిన్నారులకు కరోనా వైరస్: వసతిగృహల్లో ఏం జరుగుతోంది, సుప్రీంకోర్టు ఆగ్రహాం, నివేదిక...

|
Google Oneindia TeluguNews

వసతి గృహంలో ఉన్న పిల్లలకు కరోనా వైరస్ సోకడంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెన్నైలో గల వసతిగృహంలో 35 మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.

జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌ను గురువారం విచారించింది. వార్డెన్‌కు వైరస్ సోకినట్టు తెలుస్తోంది.. మరీ ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఘటనపై స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది. వసతి గృహంలో వైరస్ వ్యాప్తిస్తోన్న ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఘటనపై సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని తమిళనాడు వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి స్పష్టంచేసింది. కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

SC seeks report from Tamil Nadu on 35 shelter children coronavirus positive

తమిళనాడు కాదు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా వసతి గృహాలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏ మేరకు చర్యలు తీసుకున్నాయో తమ స్పందనను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు, జువైనల్ జస్టిస్ కమిటీ పరిధికి ప్రశ్నాపత్రం కూడా అంజేస్తామని.. అందులో వసతి గృహల్లో పరిస్థితికి సంబంధించి వివరాలు నమోదు చేయాలని కోరింది. దేశంలోని వసతి గృహల్లో పరిస్థితి గురించి జూలై 6వ తేదీన విచారణ జరుపుతామని పేర్కొన్నది.

English summary
Supreme court on Thursday sought a status report and a reply from the Tamil Nadu government in the case of 35 children of a shelter home in Chennai testing positive for covid-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X