సీజేఐ కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీం సమన్లు

ఢిల్లీ : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపు ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముమ్మరం చేసింది. కుట్ర జరుగుతోందంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిన అడ్వకేట్ ఉత్సవ్ బైన్స్ దానికి సంబంధించిసాక్ష్యాధారాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. విచారణలో భాగంగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేసింది. మధ్యాహ్నం 12:30గం.లకు జడ్జిల ఛాంబర్‌లో హాజరుకావాలని ఆదేశించింది. కేసు విచారణను మధ్యాహ్నం 3గం.లకు వాయిదా వేసింది.

అడ్వొకేట్ ఉత్సవ్ బైన్స్ చేసిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. సీబీఐపై నమ్మకం లేదన్న బైన్స్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సీజేఐపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని జడ్జిలు అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అడ్వకేట్‌కు ఉత్సవ్‌కు ప్రాణహాని ఉన్నందున ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

SC Summons CBI, Intel, Cops On Conspiracy Against CJI
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+