రేపటికి వాయిదా పడిన చిదంబరం ముందస్తు బెయిల్ విచారణ
ఈడీ కేసులో చిదంబరం బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలోనే చిదంబరం దానిపై సుప్రిం కోర్టుకు వెళ్లారు. దీంతో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం సుప్రిం కోర్టును ఆశ్రయించడంతో నేడు విచారణకు చేపట్టింది. అయితే మధ్యహ్నం చేపట్టిన వాదనలను రేపటికి వాయిదా వేసింది. దీంతో బుధవారం కూడ మరోసారి ముందస్తు బెయిల్‌పై వాదనలు కొనసాగనున్నాయి. కాగా మంగళవారం నాటికి ఆయన్ను ఆరెస్ట్ చేయకుండా చిదంబరానికి ఉపశమనం కల్గించింది.
ఈ నేపథ్యంలోనే దర్యాప్తు జరుపుతున్న సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదనే కారణంతోనే ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తున్నారని, ఈనేపథ్యంలోనే దర్యాప్తు సంస్థలు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానలు ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని చిదంబరం తరపుణ వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రశ్నించారు. ఇది ఆర్టికల్ 21కు వ్యతిరేకమని చెప్పారు. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడీయా కేసుకు సంబంధించి ఈ నెల ముప్పై వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో నాలుగు రోజుల పాటు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.

ఇక ఈ సంధర్భంలోనే సీబీఐ కస్టడీలో ఉన్న చిదంబరంకు లై డిటెట్టర్‌తో పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో గత వారం అరెస్ట్ అయిన చిదంబరం దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే వాదనను సీబీఐ తీసుకువస్తుంది. సీబీఐ అరెస్ట్ తర్వాత నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉన్న చిదంబరం, అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీంతో లై డిటెక్టర్ ద్వార ప్రశ్నించేందుకు సీబీఐ సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు కేసులో ముద్దాయిగా ఉన్నా ఇంద్రాని ముఖర్జీలను ఎదురెదురుగా ఉంచి ప్రశ్నించేందుకు కూడ సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications