Manish Sisodia : అరెస్టుపై సుప్రీంను ఆశ్రయించిన సిసోడియా-సాయంత్రం అత్యవసర విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ.. తాజాగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా విచారించి అరెస్టు చేసింది. నిన్న ఆయన్ను స్ధానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్ వేయించడంతో పాటు ఐదురోజుల కస్టడీకి కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ మద్యం విధానంలో మార్పులు చేసేందుకు మనీష్ సిసోడియా సౌత్ గ్రూప్ తో చేతులు కలిపారని సీబీఐ ఆరోపిస్తోంది. దీనికి సాక్ష్యంగా నిందితులతో మనీష్ సిసోడియా చేసిన వాట్సాప్ ఛాట్ ను చూపిస్తోంది. ఆ ఛాట్ తర్వాతే ఢిల్లీ మద్యం విధానంలో మార్పులు చోటు చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో విచారణకు సిసోడియా సహకరించలేదని, సాక్ష్యాల్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూసీబీఐ అధికారులు తాజాగా మనీష్ సిసోడియా ను అరెస్టు చేశారు.కోర్టు సాయంతో ఐదు రోజుల కస్టడీలో విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు.

దీనిపై మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని అక్రమమని ఆదేశించాలని కోరుతూ సిసోడియా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సుప్రీంకోర్టు ఇవాళ సాయంత్రం 3.50 గంటలకు ఈ పిటిషన్ ను విచారించాలని నిర్ణయించింది. రేపటి నుంచి సిసిడియాకు సీబీఐ కస్టడీ ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా పిటిషన్ పై అత్యవసరణ విచారణకు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications