Article 370: జమ్మూ కశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా-ఎన్నికలు-కేంద్రం, ఈసీకి సుప్రీం ఆదేశాలు..
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసిన కేంద్రం నిర్ణయాన్ని ఇవాళ సమర్ధించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ఇతర అంశాల్లో మాత్రం ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా కీలక ఆదేశాలు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ ను కేంద్రం నాలుగేళ్ల క్రితం మూడు ముక్కలు చేసిన అంశంలో లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై మాత్రమే కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని మాత్రం పునరుద్ధరించాలని ఆదేశించింది.
ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమా కాదా అన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును ప్రకటించింది. సుదీర్ఘంగా ప్రకటించిన తీర్పులో సీజేఐ డీవై చంద్రచూడ్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో జమ్మూ కశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ప్రకటించడంతో పాటు అక్కడ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఆదేశాలు ఇచ్చారు. లఢక్ విషయంలో మాత్రం కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం.. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించింది. అయితే పునరుద్ధరణ మాత్రం ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోనూ జమ్మూకశ్మీర్ కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అదే సమయంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి డెడ్ లైన్ పెట్టింది.
మరోవైపు అప్పట్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వారిలో కీలకమైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశంసించింది. వీరు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications