24 గంటల్లో ప్రతీకారం తీర్చుకున్నారు.. మమతా బెనర్జీపై మోడీ ఫైర్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటానన్న 24 గంటల్లోనే దీదీ అన్నంత పని చేశారని చురకలు అంటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై దాడి జరగడం అందులో భాగమేనంటూ ఎద్దేవా చేశారు.

మమతా బెనర్జీకి సంబంధించి మార్ఫింగ్ చేసిన ఫోటోను బీజేపీ కార్యకర్త షేర్ చేస్తే జైలులో పెట్టడం తగదన్నారు. ఆడ కూతుళ్లను సతాయిస్తే రేపు మీకు శిక్ష ఖాయమంటూ వ్యాఖ్యానించారు. ఒక ఫోటోను మార్ఫింగ్ చేస్తే అంత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. అలాంటి విషయాలను తాను చాలా తేలికగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఎవరైనా తన ఫోటోను అలా మార్ఫింగ్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లో కోపం తెచ్చుకోనని.. ఒక ప్రధానిగా హుందాగా వ్యవహరిస్తానని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే సీన్ ఉండబోదని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Scared Of Her Own Shadow PM Modi Targets Mamata Banerjee At Bengal Rally

ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా రెపరెపలాడుతుందని.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీదే అధికారమన్నట్లుగా సర్వేలు కూడా అదే విషయం చెబుతున్నాయని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలవనున్న 300 స్థానాల్లో బెంగాల్ తోడ్పాటు కచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+