అమ్మాయిని బాత్రూంకు తీసుకెళ్లి బట్టలు విప్పించారు

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. తోటి విద్యార్థులు ఓ బాలికను బాత్ రూంకు తీసుకు వెళ్లి దుస్తులు విప్పించి ర్యాగింగ్ చేశారు. ఈ సంఘటన జోద్‌పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓ ప్రయివేటు పాఠశాలలో ఇటీవల ఓ విద్యార్థిని పదకొండో తరగతిలో చేరింది. ఈ నెల 8వ తేదీన ఇతర విద్యార్థినులు ఆమెను బాత్ రూంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ బలవంతంగా ఆమెతో బట్టలు విప్పించినట్టు పోలీసులు తెలిపారు.

School girl ragged, stripped by classmates in Rajasthan

ర్యాగింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠసాల యాజమాన్యంతో పాటు ర్యాగింగ్ చేసిన విద్యార్థినులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ కోసం అంతర్గత కమిటీని నియమించినట్లు స్కూల్ సెక్రటరీ తెలిపారు. ర్యాంగింగ్‌కు పాల్పడిన విద్యార్థినులను సస్పెండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A student of a private school here was allegedly ragged and stripped by five of her classmates, prompting police to register a case against the accused and the school authorities.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి