వింత ప్రిన్సిపాల్: అమ్మాయిల తలగడతోనే.., డ్యాన్సులు

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు అర్బన్ జిల్లాలోని యెల్లమన్న పాళ్యలోని ఓ పాఠశాలకు మల్లికార్జున్ స్వామి అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్కడ విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం ఉంది. రాత్రివేళ ఈ ప్రిన్సిపాల్ పడుకోవాలంటే ఎవరైనా అమ్మాయి తన తలగడనో, దుప్పటినో ఇతగాడికి ఇవ్వాలట.
ఎందుకంటే వాటిపై పడుకుంటే రొమాంటిక్ కలలు వస్తాయని అతగాడి నమ్మకం. అంతేగాక రాత్రి అయిందంటే చాలు, కార్తీక్ అనే సహచరుడితో కలిసి దమ్యం సేవించి అమ్మాయిల హాస్టల్ ముందు డ్యాన్సులు చేయడం ఇతడి మరో విచిత్ర అలవాటు.
విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు, ఇతర పాఠశాల సిబ్బంది కూడా మల్లికార్జున్ స్వామి వింత చేష్టలతో విసిగిపోయారు. చివరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సదరు ప్రిన్సిపాల్ మల్లిఖార్జున స్వామిని, అతడి సహచరుడ్ని అరెస్టు చేశారు. స్వామి ఫోన్‌లో అమ్మాయిల ఫొటోలు ఉన్నాయని వచ్చిన ఆరోపణలపైనా పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications