Viral Video: నీటిలో తడవొద్దని ఇలా చేసింది.. పంతులమ్మకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన అధికారులు..
దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వానలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు,చెరువులు, నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల కాలనీల్లోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ చోట ఓ ఉపాధ్యాయురాలు నీటిలో తడవకూడదని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కుర్చీలపైకి ఎక్కి
ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు తను నీటిలో తడవకూడదని విద్యార్థులతో కూర్చీలు వేసుకున్నారు. ఆ తర్వాత ప్లాస్టిక్ కుర్చీలపైకి ఎక్కి వరదలో ఉన్న పాఠశాలలోకి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.

పిల్లల సహాయంతో
పాఠశాల గేటు, పాఠశాల భవనానికి మధ్య వర్షపు నీరు ఆగిపోయింది. ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ నీటిలో నడిచేందుకు ఇష్టపడక అక్కడే ఉన్న విద్యార్థులను పిలిచి స్కూల్ లో ఉన్న కూర్చీలను బయటకు తెప్పించి గేటు నుంచి భవనం వరకు వేయించుకున్నారు. పిల్లల సహాయంతో కూర్చీలు ఎక్కుతూ భవనం వద్దకు చేరుకున్నారు.
మధుర జిల్లాలో
ఈ ఘటన యూపీలోని మధుర జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాఠశాల ప్రాంగణం జలమయమైంది.












Click it and Unblock the Notifications