teacher: టీచర్ కొడుకును కిడ్నాప్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్, క్లైమాక్స్ లో ఏం జరిగిందంటే ?
బెంగళూరు: సినిమా స్టైల్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసులు రక్షించారు. సింగం సినిమా టైపులో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కిడ్నాపర్ల వెంటపడ్డారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆ అబ్బాయి తల్లిదండ్రులను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. కిడ్నాప్ చేసిన బాలుడిని వదిలిపెట్టాలంటే రూ. 10 లక్షలు కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడిని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ స్కూల్ టీచర్
కర్ణాటకలోని కలబురిగి నగరంలోని సిద్దేశ్వర కాలనీలో ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న గురునాథం నివాసం ఉంటున్నారు. బుధవారం ఎప్పటిలాగే పాఠశాలకు బయలుదేరిన గురునాథ్ రాథోడ్ తో పాటు అతని కుమారుడు బయలుదేరాడు. ఆ సందర్బంలో. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గురునాథ్ స్కూల్ లోకి వెళ్లిపోయాడు.

రూ. 10 లక్షలు డిమాండ్
స్కూల్ దగ్గర నడుచుకుని వెలుటున్న టీచర్ గురునాథ్ కుమారుడు సుదర్శన్ ను కొందరు ఆటోలో కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్లు అపహరణ జరిగిన కొంత సమయం తరువాత ఉపాధ్యాయుడు గురునాథ్‌కు ఫోన్ చేసి నీ కొడుకును కిడ్నాప్ చేశామని చెప్పారు. నీ కొడుకు బతికి ఉండాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ధైర్యం చేసిన టీచర్
నీ కొడుకు సుదర్శన్ కిడ్నాప్ అయ్యాడని పోలీసులకు చెబితే చంపేస్తానని టీచర్ గురునాథ్ ను బెదిరించారు. అయితే దీనిపై టీచర్ గురునాథ్ ధైర్యంగా వెళ్లి కలబురగి యూనివర్సిటీ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. యూనివర్శిటీ స్టేషన్ సీపీఐ అరుణ్ మురగుడి తన బృందంతో కలిసి బాలుడి కోసం గాలించారు..

ఆటోలో వదిలేసి కిడ్నాపర్లు జంప్
పోలీసులు తమను వెంబడిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న కిడ్నాపర్లు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కలబురగి తాలూకాలోని పాల గ్రామ శివారులో గురునాథ్ కుమారుడిని వదిలేసి పరారైనారు. బాలుడి ఆచూకి తెలుసుకున్న పోలీసులు అతన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. టీచర్ గురునాథ్ కుమారుడిని కిడ్నాప్ చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications