Tamil Nadu: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు. కృష్ణగిరి సమీపంలోని పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ అరాచకం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో విద్యార్థని తల్లి ఉపాధ్యాయులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజానికి ఆ అమ్మాయి ఒక నెల రోజులుగ పాఠశాలకు వెళ్లడం లేదు. స్కూల్ ప్రిన్సిపాల్ సహచర విద్యార్థులను ఆరా తీయగా.. వారు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆయన బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అడిగారు. ఆ తల్లి జరిగిన దారుణం గురించి మొత్తం ప్రధానోపాధ్యాయుడికి వెల్లడించింది. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి హాస్పిటల్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పడంతో ఆయన నివ్వెరపోయారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలియగా.. ప్రిన్సిపాల్ సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా బాలల రక్షణ అధికారికి నివేదించమని ప్రిన్సిపాల్ సలహా ఇవ్వగా.. వారు అధికారులకు తెలిపారు. ఆ అధికారులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలికకు చికిత్స అందుతోంది.

నిందితులకు 15 రోజుల పోలీసు కస్టడీ
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కృష్ణగిరి మహిళా పోలీసు బృందం ముగ్గురు నిందితులు చిన్నసామి(57), ఆరుముగం(45), ప్రకాశ్(37)లను అరెస్టు చేసింది. ముగ్గురినీ 15 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బాలిక బంధువులు నిరసన వ్యక్తం చేసి, ముగ్గురు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications