Viral video: మీరేమి టీచర్లురా అయ్యా.. ఫుడ్ కోసం కూడా ఎగబడి.. ఎక్కడంటే..?
జాతి నిర్మాణంలో టీచర్ల రోల్ కీలకం. స్టూడెంట్స్‌ను తీర్చిదిద్దేది వారే. విద్యా బుద్దులు చెప్పి.. దేశానికి పునరంకితం చేయాలి. కానీ చాలా చోట్ల టీచర్ల ప్రవర్తన ఇబ్బందిగా మారుతుంది. అంటే నాణ్యమైన విద్యను అందించడం లేదు. దాంతోపాటు హుందాగా ప్రవర్తించడం లేదు. అవును.. టీ, టిఫిన్ కోసం కూడా నానా యాగి చేస్తారు. ఇక ఫ్రీగా భోజనం దొరికితే అంతే సంగతులు.. ఊరిలో ఉండేవారు కూడా అలా చేయరెమో.. అవును పంజాబ్‌లో జరిగిన ఘటనను మీరు చూడండి.

ఏం చేశారు..
ఇటీవల లుధియానా ప్లస్ రిసార్ట్‌లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ టీచర్లతో సమావేశం నిర్వహించారు. విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో మీట్ నిర్హించారు. టీచర్లు, ప్రిన్సిపల్స్, విద్య అధికారులు దాదాపు 2600 మంది కోసం 57 ఏసీ బస్సులను రాష్ట్ర విద్యాశాఖ బుక్ చేసింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హయత్ వివరించారు. సమావేశం తర్వాత సీఎం మాన్ విద్యా సంస్కరణలు తీసుకురావడానికి సూచనలు ఇవ్వడానికి ఆన్ లైన్ పోర్టల్ లాంచ్ చేశారు. సందేహాలు ఉంటే తమకు తెలియజేయాలని వారు కోరారు. కానీ ఇక్కడ టీచర్లు మాత్రం భోజనం కోసం నానా రచ్చ చేశారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి.

దేశం పేరు చెడిపోయేది..
నయం వీరిని ట్రైనింగ్ కోసం విదేశాలకు పంపించలేదు.. దేశం పేరు చెడగొట్టేవారు అని కామెంట్ చేశారు. నైపుణ్యం కోసం ఇతర దేశాలకు పంపించాలని మాన్ అనుకున్నారట. కానీ భోజనం కోసం ఇలా చేశారు. ఒకరికొకరు ఎగబడ్డారు. ప్లేట్ల కోసం అంతలా హడావిడి చేశారు. వారి చేష్టలు చూసి ప్రతీ ఒక్కరూ ఇదేంటి అని ఆశ్చర్యపోయారు.
భోజనం కోసం
అవును వారు ఫ్రీగా వస్తున్న భోజనం ఎందుకు వదులుకుంటారని మరొకరు కామెంట్ చేశారు. నిజమే మరీ వారు ఎంతయిన బడి పంతుళ్లు కదా.. ఇలానే చేస్తారు. వారికి విలువలు ఉండవు. పేరుకు టీచర్లు అని చెబుతారు. కానీ లేకిడిగా బీహెవ్ చేస్తారు. ఇదే కాదు ఇతర సందర్భంలో కూడా పంతుళ్లు ఇలానే చేశారు. చాలా సందర్భాల్లో వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. ఇప్పడు పంజాబ్‌లో జరిగిన ఇష్యూ వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications