Himalayas: హిమాలయాలు ఉన్న చోట సముద్రం ఉండేదట.. వెల్లడించిన పరిశోధకులు..
భారత దేశానికి హిమాలయాలు పెట్టని గోడ వలె ఉన్నాయి. ఈ హిమాలయాలు ఎన్నో జీవ నదులకు జన్మస్థలంగా ఉన్నాయి. హిమాలయాలు భారత్ లోనే కాకుండా నేపాల్, చైనాలో విస్తరించి ఉన్నాయి. ఈ హిమాలయాల వల్ల జమ్ము అండ్ కాశ్మీర్, ఉత్తర ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలు అందంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ హిమాలయాల గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ హిమాలయాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు హిమాలయాలు ఉన్న చొట ఒకప్పుడు సముద్రం ఉండేదని చెబుతున్నారు.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్్ ఆఫ్ సైన్స్, జపాన్ లోని నీగాటా యూనివర్శిటీ సంయుక్తంగా హిమాలయాల్లో పరిశోధనలు చేశారు. హిమాలయాలలో 600 మిలియన్ సంవత్సరాల క్రితం మహా సముద్రం ఉండేదని తేలినట్లు చెప్పారు. ఆ సముద్రంలో నించి మిగిలిపోయిన ఖనిజ నిక్షేపాలతో చిక్కుకున్న నీటి బిందువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ సమయానికి చెందినదని గుర్తించిన శాస్త్రతవేత్తలు.. అవి కాల్షియంను కోల్పోయినట్లు తేల్చారు.

హిమలయాల్లో సముద్ర ఫలకాలకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించడంతో తమకు ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మహాసముద్రాల్లో ప్రవహం లేదు గనుక కాల్షియం అవక్షేపం ఉండదని, దానిలో నెమ్మదిగా మెగ్నిషియం పెరుగుతుందని వివరించారు. వాతావరణంలో ఆక్సిజన్ పెరిగినప్పుడల్లా జీవసంబంధమైన రేడియేషన్ ఉంటుందన్నారు.
కొంత మంది శాస్త్రవేత్తలు పశ్చిమ కుమావోన్ హిమాలయాలలో అమృత్‌పుర్ నుంచి మిలామ్ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రుడూన్ నుంచి గంగోత్రి వరకు అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం వెతికినట్లు చెప్పారు. గుర్తించిన నిక్షేపాలు పురాతన సముద్ర ఉనికి చాటి చెప్పాయన్నారు.












Click it and Unblock the Notifications