Wife: ఇద్దరికి రెండో పెళ్లి, మొదటి భర్త కూతురికి పెళ్లి చేసిన భార్య, పగ, నరికి చంపేసిన రెండో భర్త !

చెన్నై/ తిరుచ్చి: మహిళ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. మరో వ్యక్తి వివాహం చేసుకుని కూతురికి తండ్రి అయిన తరువాత అతని భార్యతో విడాకులు తీసుకున్నాడు. భర్తతో విడాకులు తీసుకున్న మహిళ, బార్యతో విడాకులు తీసుకున్న భర్తకు పరిచయం అయిన కొంతకాలం తరువాత పెళ్లి చేసుకునున్నారు. ఇద్దరికి రెండో పెళ్లి కావడంతో సంతోషంగానే కాపురం చేశారు. భార్య ఆమె మొదటి భర్తకు పుట్టిన కూతురికి ఆమె బంధువుల సహకారంతో గ్రాండ్ గా పెళ్లి చేసింది. భర్త మొదటి భార్యకు పుట్టిన కూతురికి పెళ్లి చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కూతురికి పెళ్లి అయిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ఇదే విషయంలో దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దంపతులకు వాళ్ల స్నేహితులు, బంధువులు సర్దిచెబుతూ వస్తున్నారు. సహనం కోల్పోయిన భర్త అతని రెండో భార్యను అతిదారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 విడాకులు తీసుకున్న మహిళ

విడాకులు తీసుకున్న మహిళ

తమిళనాడులోని తిరుచురాపల్లిలో సెల్వి అనే మహిళ నివాసం ఉంటున్నది. సెల్వి వివాహం చేసుకుని మణివాసకం, మహాలక్ష్మి అనే ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమె భర్తతో తేడాలు వచ్చాయి. చాలాకాలం భర్తతో కాపురం చేసి గొడవలతో విసిగిపోయిన సెల్వి ఆమె భర్తతో విడాకులు తీసుకుంది.

 భార్యతో విడాకులు..... ఇద్దరు ఫ్రెండ్స్

భార్యతో విడాకులు..... ఇద్దరు ఫ్రెండ్స్

తిరుచురాపల్లిలోనే నివాసం ఉంటున్న సెల్వాకు గతంలో వివాహం అయ్యింది. కవియరసి అనే కూతురు పుట్టిన తరువాత సెల్వాకు అతని భార్యతో గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో సెల్వా అతని భార్యతో విడాకులు తీసుకున్నాడు. భార్యతో విడాకులు తీసుకున్న సెల్వాకు, భర్తతో విడాకులు తీసుకున్న సెల్వీకి పరిచయం అయ్యింది. తరువాత సెల్వీ, సెల్వా స్నేహితులు అయ్యారు.

 ముగ్గురు పిల్లల సమక్షంలో రెండో పెళ్లి

ముగ్గురు పిల్లల సమక్షంలో రెండో పెళ్లి

సెల్వా, సెల్వీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సెల్వీ, కూతురికి తండ్రి అయిన సెల్వా ముగ్గురు పిల్లలను సాక్షంగా పెట్టుకుని బంధువులు, స్నేహితుల సమక్షంలో 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. తిరుచురాపల్లిలోనే ముగ్గురు పిల్లలతో కలిసి సెల్వీ, సెల్వా సంతోషంగా కాపురం చేశారు.

 భార్య మొదటి భర్త కూతురి పెళ్లితో తేడాలు

భార్య మొదటి భర్త కూతురి పెళ్లితో తేడాలు

సెల్వీ ఆమె మొదటి భర్తకు పుట్టిన మహాలక్ష్మికి పెళ్లి చెయ్యాలని పెళ్లి సంబంధాలు చూసింది. సెల్వీ సొంత ఊరు అయిన మనమదురైలోని పుట్టింకి ఏడాది క్రితం వెళ్లింది. ఆ సమయంలో పుట్టింటి దగ్గర ఉన్న బంధువులు సెల్వీ కూతురు మహాలక్ష్మికి పెళ్లి సంబంధం చూశారు. 8 నెలల క్రితం మహాలక్ష్మి ఆమె మొదటి భర్తకు పుట్టిన మహాలక్ష్మికి గ్రాండ్ గా పెళ్లి జరిపించింది.

 దంపతుల మద్య తేడాలు

దంపతుల మద్య తేడాలు

సెల్వీ రెండో భర్త సెల్వా అతని మొదటి భార్యకు పుట్టిన కూతురు కవియరసికి పెళ్లి చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. సెల్వీ కూతురికి పెళ్లి అయిన తరువాత సెల్వా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ఇదే విషయంలో సెల్వా, సెల్వీ దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దంపతులకు వాళ్ల స్నేహితులు, బంధువులు సర్దిచెబుతూ వస్తున్నారు.

 సైలెంట్ గా చంపేసి ఎస్కేప్.... భయంతో లొంగిపోయిన భర్త

సైలెంట్ గా చంపేసి ఎస్కేప్.... భయంతో లొంగిపోయిన భర్త

రోజు ఇంట్లో సెల్వా, సెల్వీ దంపతులు గొడవలు పడుతూనే ఉన్నారు. చివరికి సహనం కోల్పోయిన సెల్వా అతని రెండో భార్య సెల్వీని అతిదారుణంగా నరికి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు సెల్వా కోసం గాలించారు. చివరికి పోలీసుల భయంతో సెల్వా తిరుచ్చి ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 18 ఏళ్లపాటు సంతోషంగా కాపురం చేసిన తరువాత తన భార్య సెల్వీ తనను నిర్లక్షం చేసిందని, అందుకే చంపేశానని సెల్వా అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని తిరుచ్చి ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+