భారీ జరిమానా: సత్యం రాజుకు ఊరట, నిషేధంపై షాక్

ముంబై: సత్యం రామలింగ రాజుకు సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో సోమవారం ఊరట లభించింది. గతంలో రామలింగరాజుతో పాటు మరో నలుగురు మీద సెబీ రూ.1,849 కోట్ల రూపాయలను జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని 12శాతం వడ్డీతో కలుపుకుని (అంటే మొత్తం రూ.3,000కోట్లు) 45 రోజుల్లో చెల్లించాలని సెబీ ఆదేశించింది.

 Securities Appellate Tribunal stays Sebi fine on Ramalinga Raju

సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ రామలింగరాజు తదితరులు సెక్యూరిటీస్ అప్సిలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణను సోమవారం చేపట్టిన శాట్ సెబీ జరిమానాపై స్టే ఇచ్చింది.

ఇంత భారీ జరిమానాలకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారనే విషయంపై నవంబర్ 7లోగా వివరణ ఇవ్వాలని సెబీని శాట్ ఆదేశించింది. అయితే, స్టాక్ మార్కెట్ల నుంచి రామలింగరాజు తదితరులను 14 సంవత్సరాల పాటు నిషేధిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయాన్ని శాట్ సమర్థించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను శాట్ డిసెంబర్‌కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+