యూపీ, పంజాబ్ పోరులో బీజేపీ నేతలకు ముప్పు-25 మందికి పైగా నేతలకు కేంద్రం భద్రత
యూపీ, పంజాబ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఐదు రాష్టాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఈ రెండు రాష్టాల్లో పోరు మాత్రం భిన్నంగా ఉంది. దీంతో పాటు ఇక్కడ బీజేపీ అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలకు ముప్పు కూడా పెరుగుతోంది.
యూపీలో గ్యాంగ్ స్టర్ల నుంచి, పంజాబ్ లో ఖలిస్తాన్ గ్రూపుల నుంచి బీజేపీ నేతలకు ముప్పు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులతో పాటు వారికి మద్దతుగా ఉన్న కాషాయ నేతలకు కూడా ప్రాణహాని ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పిస్తోంది. ఇలా అదనపు భద్రత తీసుకుంటున్న బీజేపీ నేతలు, అభ్యర్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు రెండు డజన్ల మందికి పైగా బీజేపీ నేతలకు ఇలా కేంద్రం అదనపు భద్రత కల్పించింది.

Recommended Video
దాదాపు రెండు డజన్ల మంది బిజెపి నాయకులు, ప్రధానంగా పంజాబ్‌కు చెందిన వారికి ముప్పును విశ్లేషించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. రెండు అగ్రశ్రేణి పారామిలటరీ బలగాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇందులో నిమగ్నమవుతున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే పంజాబ్ పోలీసుల నుండి భద్రత తీసుకుంటున్న వారే కావడం విశేషం.అయితే "ప్రస్తుతం పంజాబ్ పోలీసులు వారికి అందించిన భద్రత కంటే ఎక్కువ భద్రతను ఇవ్వాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications