4గురు ఉగ్రవాదుల హతం: ఆర్మీకి చిక్కిన పాక్ ఉగ్రవాది

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నౌగమ్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా సిబ్బంది ఆపరేషన్‌ చేపట్టారు.

కాగా, ఉగ్రవాదులు భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు వారిపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిని భద్రతాబలగాలు సజీవంగా బంధించాయి.

అదుపులోకి తీసుకున్న ఉగ్రవాది నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. నౌగమ్‌లో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లుఆ అధికారి వెల్లడించారు.

కాగా, ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఓ వైపు భారత్ కార్గిల్ విజయ్ దివాస్ జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం గమనార్హం. ఇది ఇలా ఉండగా, ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడుతూ.. ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం చాలా గొప్పవిషయమనన్నారు. ఈ సందర్భంగా భద్రతాసిబ్బందిని ఆయన అభినందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four militants were on Tuesday killed and another apprehended by security forces during an encounter in Naugam sector near the LoC in Kupwara district of Kashmir, while one was captured alive, an army official said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి