సింగిల్ సిగరెట్ అమ్మకంపై నిషేధం ... కొత్త నిబంధన తీసుకు రానున్న కేంద్రం

న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు, యువతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దేశంలో సింగిల్ సిగరెట్లను విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. వ్యక్తిగత సిగరెట్ స్టిక్స్, అన్‌టైడ్ పొగాకు ఉత్పత్తులను తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు, యువతే ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

ఇలా విడి విడిగా ఒక్కొక్కటి కొనుగోలు చేయడం వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ విడి ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే అటువంటి విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Selling of single cigarettes to be illegal in India? centre to introduce new rule soon

భారతదేశంలో చాలా మంది ధూమపానం చేసేవారు మొత్తం ప్యాక్‌లకు బదులుగా విడి విడిగా సిగరేట్లను ఒకటి రెండు కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా,చాలా మంది యువకులు ధూమపానానికి అలవాటు పడ్డారు, అంతేగాక, తీవ్రమైన ఆరోగ్యబారినపడుతున్నారు.

స్మోకింగ్ బెడదను అరికట్టేందుకు విమానాశ్రయాల్లోని స్మోకింగ్ జోన్లను మూసివేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. సాధారణ బడ్జెట్డ్జె లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంపు ఉంటుందన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. వాటి ప్రకారం.. అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వా నికి తక్షణమే ఆదాయాన్ని పెంచే అవసరాన్ని పరిష్కరించడానికి చాలా ప్రభావవంతమైన విధానం. ఇది ఆదాయాన్ని సంపాదించడానికి, పొగాకు వినియోగం, సంబంధిత వ్యా ధులను తగ్గించడానికి విజయవంతమైన ప్రతిపాదననగా చెబుతున్నారు.

Selling of single cigarettes to be illegal in India? centre to introduce new rule soon

అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వా నికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. పొగాకు ఉత్పత్తులను తక్కువ ధరలో ఉండటం వల్లే యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయం ఓ ప్రభుత్వ ఆదాయానికి పెంచడంతోపాటో మరోవైపు, యువతను పొగాకు దూరం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో లక్షలాది మంది సామాన్యులు, యువత పొగాకు దూరమవుతారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+