శశికళకే పన్నీరు ఓటు,తీర్మానాన్ని ప్రతిపాదించిన సెల్వం
అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ ఎన్నిక కావడంలో పార్టీ కీలక నాయకులంతా ఒక్కటయ్యారు. చిన్నమ్మకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓటేశారు.
చెన్నై: అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ ఎన్నిక కావడంలో పార్టీ కీలక నాయకులంతా ఒక్కటయ్యారు. చిన్నమ్మకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓటేశారు. పన్నీర్ సెల్వం శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు చేపట్టాలని కోరుతూ తీర్మాణం ప్రవేశపెట్టాడు.
అన్నాడిఎంకె పార్టీ కీలకమైన సమావేశం పార్టీ కార్యాలయంలో గురువారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రవేశపెట్టారు.

ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని పార్టీ నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పన్నీరు సెల్వంతో పాటు పార్లమెంట్ లో పార్టీ నాయకుడు తంబిదురై కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. శశికళకు వారంతా తమ మద్దతును ప్రకటించారు.
జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టే శక్తి, సామర్థ్యాలు శశికళకు ఉన్నాయని భావించి ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నట్టు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రకటించారు. సమావేశం ముగిసిన తర్వాత శశికళనుపార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్న విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications