రేప్: కోర్టు ఎదుట మహిళల అర్ధనగ్న ప్రదర్శన (ఫోటో)
కోచి: యూపిలో జరుగుతున్న అత్యాచారాలపై మలయాళీ మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్త్రీ కూటైమ అనే దళానికి చెందిన ఆరుగురు మహిళా కార్యకర్తలు కేరళ హైకోర్టు ముందు నగ్నంగా మారి, తరువాత ఒంటి చుట్టూ ఆకుపచ్చ, తెలుపు, కాషాయం... మూడు రంగుల్ని ప్రతిబింబించేలా వస్త్రాలు చుట్టుకుని అత్యాచారాలు నిరోధించాలంటూ నినాదాలు చేశారు.
స్త్రీ కూటైమ దళంలో 30 మంది మహిళలు ఉండగా వారిలో ఆరుగురు అర్ధనగ్న నిరసన తెలుపగా మిగిలిని 25 మంది నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగి పోలీసులు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా, అసభ్యంగా ప్రవర్తించారని, బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేశారని ఆ ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తరువాత బెయిల్ పైన వారిని విడిచిపెట్టారు.

తల దించుకుంటున్నా: అరుంధతీ
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వార్తాపత్రికల్లో చదివిన ప్రతిసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఎస్‌బిఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై కేరళలోని తిరువనంతపురంలో ఆమె మాట్లాడారు. మహిళలపై హింసను కేంద్రంలోని ఎన్డీయే కూటమి నిరోధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
నాయకులే రక్షిస్తున్నారు: ఉమాభారతి
యూపిలో రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఉమ్మడిగా రేపిస్టులను రక్షిస్తున్నాయని కేంద్ర మంత్రి ఉమాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడారు. అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దురాగతాలపై పార్లమెంటులో చర్చిస్తామన్నారు. మహిళలపై నేరాలకు రాజధానిగా ఉత్తరప్రదేశ్ మారిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications