ఢిల్లీ స్కూల్లో ఘోరం: 15ఏళ్ల బాలికపై సీనియర్ లైంగిక దాడి

ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి వయస్సు 17 ఏళ్లు. అతను పదకొండవ తరగతి చదువుతున్నాడు. ఈ సంఘటన తర్వాత అతను అక్కడి నుండి ఇంటికి పారిపోయాడని తెలుస్తోంది. అతని పైన ప్రశాంత్ విహార్ పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన మంగళవారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన క్లాస్ రూంలో జరిగిందా లేదా వాష్ రూంలో జరిగిందా అనే విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీని పైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల మేరకు... తాను ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆ విద్యార్థి తనను ఆపాడని, అనంతరం ఎవరు లేని సమయంలో అతను తన పైన వేధింపులకు పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. ఈ విషయాన్ని బాలిక మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో పాఠశాల వర్షన్ కూడా రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications