ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతపై దుండగుల కాల్పులు: విషమం
జలందర్: పంజాబ్‌లో సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, రిటైర్డ్ బ్రిగేడియర్ జగదీశ్ గగ్నేజాపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జగదీశ్ అతని భార్యతో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి జ్యోతి చౌక్ వద్ద ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు.

తీవ్ర గాయాలపాలైన జగదీశ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకెళ్లాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీశ్‌పై దాడి నేపథ్యంలో ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications