వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్, నష్టాల్లో నిఫ్టీ..

శనివారం ఉదయం రికార్డుల దిశగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. ముగింపు సమయానికి స్వల్ప లాభాలను మాత్రమే నమోదు చేయగలిగింది. చివరి గంటలో ఇన్వెస్టర్లు షేర్లను విత్ డ్రా చేసుకోవడంతో సెన్సెక్స్ అనుకున్నంత మేర లాభాలన

|
Google Oneindia TeluguNews

ముంబై: శనివారం ఉదయం రికార్డుల దిశగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. ముగింపు సమయానికి స్వల్ప లాభాలను మాత్రమే నమోదు చేయగలిగింది. చివరి గంటలో ఇన్వెస్టర్లు షేర్లను విత్ డ్రా చేసుకోవడంతో సెన్సెక్స్ అనుకున్నంత మేర లాభాలను నమోదు చేయలేకపోయింది.

అటు బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా తడబడటం సెన్సెక్స్ పై ప్రభావం చూపించింది. సెన్సెక్స్ స్వల్పంగా లాభపడినప్పటికీ.. నిఫ్టీ మాత్రం నష్టపోయింది. నిజానికి ఆసియా మార్కెట్లలో ఉన్న సానుకూల వాతావరణంతో ఈ ఉదయం సెన్సెక్స్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఆరంభంలోనే 100పాయింట్లకు పైగా లాభపడి సరికొత్త రికార్డుల దిశగా సాగింది.

Sensex erases gains, closes flat; Nifty ends 20 points down

సెన్సెక్స్ రికార్డు దిశగా సాగడంతో.. చాలామంది ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించారు. దీంతో సెన్సెక్స్ లాభం కొంతమేరకే పరిమితమైంది. మొత్తంగా 10 పాయింట్లు లాభపడి 33,157 వద్ద సరికొత్త రికార్డుతో సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ భారీగా పతనమైంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 21 పాయింట్లు నష్టపోయి 10,223వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.

కాగా, ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.99గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీపోర్ట్స్‌, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, టాటామోటార్స్‌ లాభాల్లో ఉండగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. యెస్ బ్యాంకు తన షేర్ వాల్యూను 7శాతం మేర నష్టపోయింది.

English summary
Benchmark Sensex edged up 10 points on the first session of the November derivatives series on Friday to close at a life high of 33,157 on sustained buying in healthcare, infra and auto counters amid positive global cues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X