భగత్ సింగ్‌ను అవమమానించిన షబీర్ షా

శ్రీనగర్: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌పై వేర్పాటువాద నేత షబీర్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నూనూగు మీసాల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబమెక్కిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్‌ను ఉగ్రవాదులతో పోల్చి అవమానించాడు.

దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడం కోసం తనను తాను అర్పించుకున్న భగత్ సింగ్‌ను షబీర్ షా కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చాడు. భగత్ సింగ్ మాదిరిగా కాశ్మీర్ ఉగ్రవాదులు కూడా ఓ గొప్ప కార్యం కోసం పోరాడుతున్నారని చెప్పాడు.

అంతేగాక, దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ అమాయక ప్రజలను చంపుతూ భారత సైనికులపై దాడులు చేస్తున్న కాశ్మీర్ ఉగ్రవాదులు దేశభక్తులని, హీరోలని షబ్బీర్ షా కొనియాడాడు.

Separatist Shabir Shah insults freedom fighter, equates terrorists with Bhagat Singh

కాగా, స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్‌తో కాశ్మీర్ ఉగ్రవాదులను పోల్చడంపై షబీర్ షాపై దేశభక్తులు మండిపడుతున్నారు. షబ్బీర్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

గత మేలో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో పాకిస్థాన్ జెండా ఎగరవేసినందుకు సెపరేటిస్ట్ డెమోక్రాటిక్ ఫ్రీడం పార్టీ ఛైర్మన్ అయిన ఈ షబీర్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పాక్‌ బలగాల కాల్పులు: జవాను మృతి

పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లఘించింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నవ్‌గామ్‌ సెక్టార్‌లో పాక్‌ బలగాలు మంగళవారం కూడా కాల్పులకు తెగబడ్డాయి. పాక్‌ బలగాల కాల్పుల్లో ఓ భారత జవాను మృతిచెందాడు. అప్రమత్తమైన భారత బలగాలు పాక్‌ కాల్పులను సమర్ధంగా తిప్పికొడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+