వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు సమావేశాలు: తొలిరోజే సభ ముందుకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పార్లమెంట్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి.

దేశం చాలా సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిపై సీరియస్ చర్చ జరగాల్సిన అవసరముందని, సభ సాఫీగా సాగటానికి సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నానని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చెప్పారు.

రైతుల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై కాంగ్రెస్ నాయకుడు మాణిక్కం టాగూర్ వాయిదా నోటీసు ఇచ్చారు.

మొత్తం 25 రోజుల పాటు సాగే ఈ భేటీల్లో వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు సహా 36 బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును (ఫామ్ లాస్ రిపీల్ బిల్లు) ఈ సమావేశాల తొలి రోజే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ తమ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ సోమవారం సభకు హాజరు కావాలని విప్‌లు జారీ చేశాయి.

కీలకమైన క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

దీనితో పాటు ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంకరప్ట్సీ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లులు కూడా ముఖ్యమైనవి.

వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో మళ్లీ తిరిగి తెచ్చే అవకాశంతో పాటు.. పెగాసస్ వివాదం, ధరల పెరుగుదల అంశాలను ప్రతిపక్షం ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశముంది.

పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sessions of Parliament: Earlier in the day, the House passed a bill repealing agricultural laws
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X