యూరిన్ బ్యాంకులు: లీటర్ మూత్రానికి రూ.1, కేంద్రం వెరైటీ ఆలోచన

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మూత్రంతో యూరియాను తయారు చేయనున్నారు. దీంతో మూత్రాన్ని నిల్వ చేసేందుకు యూరిన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు లీటర్ మూత్రానికి రూపాయిగా నిర్ణయించింది కేంద్రం.

రసాయన ఎరువులను అరికట్టేందుకు కేంద్రం వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే మనుషుల మూత్రంతో ఎరువులను తయారుచేయాలని భావిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా యూరియా బ్యాంకులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఈ విధానాన్ని దేశంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. పశువుల వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రీయ ఎరువులను గతంలో ఉపయోగించే పరిస్థితి ఉండేది. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

రూపాయికి లీటర్ మూత్రం

రూపాయికి లీటర్ మూత్రం


లీటర్ మూత్రానికి రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దేశంలో ఎరువుల కోరత తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. మూత్రం ద్వారా ఎరువులను తయారు చేయనున్నారు.

ఎంపిక చేసిన మూత్రం బ్యాంకులు

ఎంపిక చేసిన మూత్రం బ్యాంకులు


దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూత్రం బ్యాంకులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ యూరిన్ బ్యాంకుల నుండి సేకరించిన మూత్రంతో ఎరువులు తయారు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

వ్యర్థాన్ని సంపదగా మార్చడమిలా

వ్యర్థాన్ని సంపదగా మార్చడమిలా


యూరిన్‌లో నైట్రోజన్‌ శాతం అధికంగా ఉంటుంది. అయితే దీన్ని ఎరువుల తయారీకి ఉపయోగించడం వల్ల ప్రయోజనం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా కన్పిస్తోంది. దేశంలో వ్యర్థాన్ని సంపదగా మార్చే ఇటువంటి ఆలోచనను అందరూ అంగీరిస్తారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

పైలెట్ ప్రాజెక్ట్‌గా యూరిన్ బ్యాంక్

పైలెట్ ప్రాజెక్ట్‌గా యూరిన్ బ్యాంక్

యూరిన్‌ నుంచి యూరియా రూపొందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా మహరాష్ట్రలో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. తొలుత మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌ దగ్గరున్నధాఫ్‌వడ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 10 లీటర్ల యూరిన్‌ను బ్యాంక్‌కు అందిస్తే.. లీటర్‌కు రూపాయి చొప్పున 10 రూపాయలు అందిస్తామని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The government has a new idea up its sleeve. According to Union minister Nitin Gadkari, every tehsil/taluka should have urine banks to produce urea. The urea can then be used as fertilizer and given to the farmer. The idea behind this is to reduce farmer's dependency on urea import.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి