దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలీపూర్ మార్కెట్‌లోని ఓ పెయింట్ పరిశ్రమలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు
అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో ఉన్న ఫ్యాక్టరీ ప్రాంగణంలో ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS)కి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. సాయంత్రం 5.25 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని, అగ్నిమాపక టెండర్లు సేవలోకి ప్రవేశించాయని చెప్పారు.
గురువారం రాత్రి 9:00 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చామని, కూలింగ్ ఆఫ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశామని ఓ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications