భక్తులకు హుండీ డబ్బుల పంపిణీ.. అనాదిగా ఆచారం.. తొక్కిసలాటలో ఏడుగురు మృత్యువాత
తిరుచ్చి : తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆనాదిగా వస్తున్న ఆచారం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. తిరుచ్చిలోని తురయార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ముత్యంపాలయంలో ఉన్న కరుప్పన స్వామి ఆలయంలో చైత్ర పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయితే తరతరాలుగా కొనసాగుతున్న హుండీ డబ్బుల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. నలుగురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 10 మంది వరకు గాయాలపాలయ్యారు.
చైత్ర పౌర్ణమి ఉత్సవాల సందర్భంలో ప్రతి ఏటా ఈ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే హుండీలోని చిల్లర నాణాలను భక్తులకు పంపిణీ చేస్తుంటారు ఆలయ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో నిల్చున్న భక్తులు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒకరిపై మరొకరు పడటంతో తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది.

చనిపోయినవారిలో ఆర్.లక్ష్మికాంతన్ (60), కె.రాజవేల్ (55), ఎస్.గాందాయి (38), ఎ.శాంతి (50), రామర్ (50), వి.పుంగవనం (50), ఆర్.వల్లి (35) ఉన్నారు. వీరంతా కరూర్, కడలూర్, సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందినవారుగా అధికారులు గుర్తించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications