గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగ్‌పూర్ వద్ద బుధవారం ఉదయం ఓ కారు ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, వారం రోజుల క్రితం గుజరాత్‌లో భావ్‌నగర్ జిల్లాలో ఓ ట్రక్కు కాలువలో పడి 28మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. గత ఏప్రిల్ నెలలో కుచ్ జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.













Click it and Unblock the Notifications