ఏడువందల మంది రైతులు చనిపోయారా.?అబ్బ ఛా..!ఆధారాలే లేవు.!పరిహారం ఎలా ఇస్తామన్న కేంద్రం.!

ఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు స్వేచ్చకు వ్యతిరేకంగా ఉన్నాయని, రైతు హక్కులను కాలరాసే విధాంగా ఉన్నాయని, ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు పదమూడు నెలలుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యలో దాదాపు ఏడువందల మంది రైతులు ఉద్యమం చేస్తూనే మరణించారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తున్నప్పటికి కేంద్ర ప్రభత్వం మాత్రం తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతు మరణాల పట్ల చాలా విచిత్రమైన ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.

రూపాయకూడా ఇచ్చేది లేదన్న కేంద్రం

రూపాయకూడా ఇచ్చేది లేదన్న కేంద్రం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులు మరణించినట్టు ఆధారాలు లేవని, అసలు వాళ్లు రైతులా కాదా అనే అంశాన్ని నిర్దారించడం కూడా కష్టంతో కూడుకున్న అంశమని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇలాంటి తరుణంలో వారికి కేంద్రప్రభుత్వం తరుపున నష్టపరిమారాన్ని ఎలా చెల్లిస్తామని కేంద్రం సూటిగా ప్రశ్రిస్తోంది. రైతులను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిరసన తెలపమన్నారని, అన్ని రోజులు నిరసన తెలపమని ప్రేరేపించిన వాళ్లు నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదని కేంద్రం ఎదురు ప్రశ్నిస్తోంది.

వాళ్లు రైతులే అని గ్యారెంటీ ఏంటి?నిలదీసిన కేంద్రం..

వాళ్లు రైతులే అని గ్యారెంటీ ఏంటి?నిలదీసిన కేంద్రం..

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలం పైగా రైతులు చేసిన ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఉద్యమంలో ఎంత మంది రైతులు చనిపోయారనే విషయంపై తమ వద్ద ఎలాంటి రికార్డు లేదని పార్లమెంటులో బీజేపి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏ ఒక్కరికి పరిహారం ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అయితే అన్నదాతలు చేసిన ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు, విపక్షాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్తాన్ కు చెందిన రైతులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.

పరిహారం ఎలా ఇస్తాం అంటున్న కేంద్ర మంత్రి

పరిహారం ఎలా ఇస్తాం అంటున్న కేంద్ర మంత్రి

సాగు చట్టాలపై ఉద్యమంలో రైతులు చనిపోయనట్లు తమ వద్ద సమాచారం లేదని కేంద్రం బుదవారం పార్లమెంట్ లో ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. సాగు చట్టాల నిరసనలో చనిపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అని పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఈ రైతు ఉద్యమంలో వ్యవసాయ దారులు చనిపోయినట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు కనుక పరిహారం చెల్లించాలనన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని మంత్రి తెలిపారు.

 ఐతే మాకేంటి అంటున్న కేంద్ర సర్కార్.

ఐతే మాకేంటి అంటున్న కేంద్ర సర్కార్.

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఎట్టకేలకు ఏడాది గడుస్తోన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఈ సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కాగా వివిధ రకాల పంటలపై కనీస మద్దతు ధర పై చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం నిర్దంద్వంగా తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+